Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్తో కూడిన నిరంభ్యంతర పత్రాన్ని అందిస్తారన్నారు.