కాకినాడ నగరంలోని ప్రధాన కోడలైన భానుగుడి సెంట్రల్ శ్రీ బాల గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో టన్ను బెల్లంతో 13 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశిష్ట పూజారి కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి భక్తులకు బెల్లం వినాయకుడిని దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా ఉష కమిటీ సభ్యులు నార్ల శ్రీనివాసరావు పెద్దకాపు చింతపల్లి గణేష్లు మాట్లాడుతూ శ్రీ బాల గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో 1981 నుంచి గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు టన్ను బెల్లంతో 13 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వివరించారు.