రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం: బీజేపీ ఆగ్రహం మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేద కుటుంబంలో జన్మించి, సామాజిక విలువలు నేర్పిన మాతృమూర్తిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయనకు దేశం గురించి తెలియదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.