వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం వద్ద సముద్ర తీరంలో గురువారం నుంచి జరుగుతున్న వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలను, పోలీసులు చేసిన ముందస్తు ఏర్పాట్లను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు డి.ఎస్.పి గీతా కుమారి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలకు గురికాకుండా వాకాడు సర్కిల్ పరిధిలోని పోలీసులు తగిన ఏర్పాటు చేయడం జరిగిందని వాకాడు సిఐ హుస్సేన్ భాష తెలిపారు