గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని సీపీఎం నాయకురాలు రజిని విమర్శించారు. వర్షం వచ్చినప్పుడు రోగులు బయటే నిలబడాల్సిన పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యూపీహెచ్సీ నిర్మాణం మూడు వంతులు పూర్తయిందని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.