పాణ్యం మండల బలపనూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కర్నూలు నుండి నంద్యాలకు వస్తున్న తుఫాన్ బలపనూరు వద్ద డివైడర్ ని ఢీకొని అదుపుతప్పి కర్నూలు వైపు వెళ్లే రోడ్డుపైకి ఎగిరి బోల్తా పడింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.