రుణాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ రుణాల ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలు పంపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు జిల్లా ఎస్పీ శివకిషోర్ ఇన్ నకిలీ ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో నకిలీ రుణాలు పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, 27 మంది పేర్లతో 2.5 కోట్ల రుణం తీసుకున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పి తెలిపారు.. నిందితుల వద్ద నుంచి పలు ఆధార్ పాన్ కార్డులు స్వాధీన పరుచుకున్నామని వ్యక్తిగత డాక్యుమెంట్లు బయట వారికి ఇవ్వడంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు..