రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ సౌత్ కోస్టల్ జిల్లాలలోని ప్రకాశం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో పాటు ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి పాల్గొన్నారు. మొదట నాగులుప్పలపాడు మండలం బి.నిడమానూరు గ్రామంలో రైతు ఎం. అనుపమ కు చెందిన 7 ఎకరాల్లో పీఎండీఎస్ సాగును, అనంతరం పోతవరం గ్రామంలో పి. శేషారావు మొక్కజొన్న క్షేత్రాన్ని వీక్షించారు. తదుపరి రైతు సేవా కేంద్రంలో విజయ్‌కుమార్ రైతులతో మాట్లాడారు