నాగలాపురం: ఇంటికి చేరిన అదృశ్యమైన వ్యక్తి నాగలాపురం మండలం కాళంజేరి గ్రామానికి చెందిన దేవరాజులు 11వ తేదీ గురువారం నాగలాపురం వెళ్లి ఇంటికి చేరలేదని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిచేసే చోట జీతం తీసుకున్న అతను డబ్బుతో పాటు వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఏఎస్ఐ అన్నారు. తప్పిపోయిన దేవరాజులుతో పాటు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం తెలియజేసి ఇంటికి వెళ్లారని ఏఎస్ఐ షణ్ముగం తెలిపారు.