పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఐ.డి.ఓ.సి ఆవరణలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన 2000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.