అన్నమయ్య జిల్లావ్యాప్తంగా యూరియా కొరత లేదని తప్పుడు కథనాలను రైతులు నమ్మవద్దని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పీలేరులో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. పీలేరులోని శ్రీనివాస ఫర్టిలైజర్స్ డీలర్ షాపు ఆదివారం తెరవనందువల్ల సోమవారం నాడు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ డీలర్ షాపులో ఒక రైతు 5 బస్తాల యూరియా అడగగా రెండు బస్తాలు తీసుకోవాలని తర్వాత మళ్లీ మిగిలిన బస్తాలు తీసుకెళ్లవచ్చని తెలిపిన సందర్భంగా చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా చూపిస్తూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని వాటిని