బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి నాయకులతో జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాదుకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని అన్నారు. ప్రాజెక్టు విషయంలో 1500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టు వేయాన్ని ఒక్కసారిగా 7500 కోట్లకు పెంచారని అన్నారు. మెగా కృష్ణారెడ్డి తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఎలాంటి పోటీ లేకుండా మేఘ కంపెనీకి ప్రాజెక్టు అప్పగించారని అన్నారు.