Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
అరకు కాఫీని మరింత విస్తృత పరిచే విధంగా అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అరకు కాఫీ రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటుచేసి స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. నేటివ్ అరకు కాఫీ మరియు సెర్ప్ కలిపి ఈ అవుట్లెట్లను నిర్వహిస్తుందని ఒక్కొక్క ఔట్లెట్ రూ.ఐదు లక్షలు విలువ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.