కొత్తవలస మండలం అలమండ- కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. రైలు నుంచి జారిపడటం వలన గాని రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడం వలన గాని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అని రైల్వే పోలీసులు చెబుతున్నారు.