పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు ఇంటిబాట పట్టారని DYFI జిల్లా అధ్యక్షులు టికానంద్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం చింతగూడ MPPS పాఠశాలకు తాళం వేసి ఉందని గమనించామన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పాఠశాలకు ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతున్నారన్నారు. MEO ను సంప్రదిస్తే సెలవులో అక్కడి టీచర్ లేదన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుంటే విద్యార్థులు నష్టపోతారన్నారు.