ఉప్పల్ మిని శిల్పారాధనలో నవరాత్రి బతుకమ్మ మరియు దసరా సంబరాలు మరియు శారీస్ ఆఫ్ ఇండియా మేన సందర్భంగా ఏర్పాటుచేసిన చేనేత చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. పోచంపల్లి, గుజరాత్ బందిని, బీహార్, భాగల్పూరి, సోలాపూర్, హ్యాండ్ బ్లాక్, వస్తారు బనారస్ మొదలైన చేనేత చీరలు అందుబాటులో ఉన్నాయి. సందర్శికులు అధిక సంఖ్యలో పాల్గొని చేనేత కళాకారులు ప్రోత్సహించవలసిందిగా శిల్పారామం మధికారులు కోరారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ వారి సంయుక్త నిర్వహణలో మంగళవారం చత్తీస్గఢ్ జానపద నృత్యం కామరా నృత్యం మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుడుంబాజ ముఖ్య ప్రదర్శనలు ఎంతగానో అల్లరించాయి.