నంద్యాల ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపానికి ఈనెల 4వ తేదీ జరగాల్సిన వేలం వాయిదా పడిందని కార్యనిర్వహణ అధికారి రామానుజన్ మంగళవారం తెలిపారు. అయితే, డెకరేషన్, సప్లయర్స్ కోసం రెండు రూముల వేలం యథావిధిగా ఈనెల 4న నిర్వహించబడుతుందని చెప్పారు. దేవదాయ శాఖ కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కళ్యాణమండపం ప్రధాన వేలం జరుగుతుందని తెలిపారు.