పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణారావు తొమ్మిది అంశాలపై ఎజెండాను వివరించారు. సింగిల్ విండో దరఖాస్తులు, ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, పరిశ్రమల రాయితీలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.