రావివలస ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని జనసేన జిల్లా సంయుక్త కార్య దర్శి ఏ.జనార్దనరెడ్డి శుక్రవారం టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందించారు. కొన్ని భవనాలు పూర్తిగా పెచ్చులు ఊడి పడిపోతున్నాయని, దీంతో 60 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను పరిశీలించి నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని కోరారు.