శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి వద్ద శనివారం ఉదయం మాజీ మంత్రి రామచంద్రారెడ్డి 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సవిత రామచంద్రారెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కుటుంబ సభ్యులు, నాయకులు రామచంద్రారెడ్డి సేవలను కొనియాడారు. మంత్రి సవిత తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కుటుంబ సభ్యులు మంత్రి సవితను ఘనంగా సన్మానించారు.