నంద్యాల సంజీవనగర్ అయోధ్య రామాలయంలో దశాబ్ద కాలంగా పర్యావరణహితంగా రకరకాల పూజా ద్రవ్యాలతో వినాయకచవితి నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. భగవత్ సేవా సంఘం ఆధ్వర్యంలో టెంకాయలు, కూరగాయలు, నవధాన్యాలతో వినాయకుని ప్రతిష్ఠించి భక్తి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈఏడాది 12,108 అరటికాయలతో 16 అడుగుల కదళీపూర్ణ ఫలగణేశుడిని తీర్చిదిద్దారు. ఈ వినూత్న ప్రయత్నం భక్తిలో వైజ్ఞానికతను మేళవించిందని పలువులు ప్రశంసిస్తున్నారు.