నెల్లూరు సబ్ డివిజన్ పరిధిలో ఉండే రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు నెల్లూరు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు సబ్ డివిజన్ లో పలు సమస్యాత్మక ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సౌజన్య మాట్లాడారు.