ఎయిడ్స్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జెసి చిన్న రాముడు పేర్కొన్నారు. ఎయిడ్స్ పై సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1097 అందుబాటు లో ఉందనీ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు తెలిపారు. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ (APSACS) ఆధ్వర్యంలో 60 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఈ ప్రచార కార్యక్రమ కరపత్రాన్ని జెసి ఆవిష్కరించారు.