కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వైసీపీ కార్యాలయం వారు సోమవారం పలు విషయాలు ప్రకటన ద్వారా తెలిపారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైస్సార్సీపీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రైతన్నలకు కష్టాలను కలిగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకురేపు 9వ తేదిన వైస్సార్సీపీ కార్యకర్తలు, రైతులు సమక్షంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి "ర్యాలీ"గా వెళ్లి రైతుల కష్టాలు ఆర్డీఓ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. కావున వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,రైతన్నలు, ప్రజలు స్వచ్ఛందంగా ఆడుగులు వేసి "ర్యాలీ" కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.