నాగాయలంక ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన పంట కాలువలో నాగాయలంక గ్రామం వద్దకు గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానిక విఆర్తో నివేదిక ఆధారంగా నాగాయలంక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐఆర్ నమోదు చేయబడింది. బంధువులు లేదా తెలిసినవారు గుర్తించేందుకు వీలుగా మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.