కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవన మృతి పూర్తిగా కోల్పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. మంగళవారం విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో కార్మికులకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇస్తానన్న వాగ్దానం తక్షణమే అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని, ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.