గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డిఎస్పి ఎన్.లింగయ్య అన్నారు. గురువారం 4 గం సమయంలో ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి డిఎస్పి భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. ఉట్కూరు గణేష్ మార్గ్ రూట్ లో మొత్తం 28 అధునాతన సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.