రాష్ట్ర ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆకాంక్షించారు.బుధువారం తన స్వగ్రామం బోరెడ్డిగారిపల్లిలో పండుగ రోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని, మంత్రిని దుశాలావళి, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు