రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు తిరుపతి నుండి బైక్ పై రైల్వే కోడూరు వస్తుండగా, వెనుక నుండి కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై ఉన్న వెంకటమ్మ అనే మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.