'యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీ పురం, బీఎన్ కండ్రిగ మండలాలలో రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు. 5 వందల టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. అక్టోబర్లో నాట్లు వేస్తారని, నవంబర్, డిసెంబర్ నెలలో రైతులకు యూరియా అవసర ఉంటుందని పేర్కొన్నారు. క్రాఫ్ట్, వెబ్ ల్యాండ్లో నమోదు ఉన్న వారికి ఇస్తామన్నారు.