షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ఉదయం మట్టి వినాయకుడిని ప్రతిష్టించి వినాయక చవితి తొలి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడుతూ ఏకదంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.