కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని సీఐటీయూ కాంట్రాక్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్ అన్నారు. పాశ మైలారం సువెన్ ఫార్మా ముందు కార్మికుల నిరసన రెండో రోజు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం మొండివైఖరి విడనాడలని కోరారు. కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు