తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షులు నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ల ఫంక్షన్ కు హాజరవగా అనంతరం మెట్ పల్లి పట్టణంలోని లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రెటరీ బొమ్మల శంకర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి స్వగృహనికి విచ్చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డిని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మల శంకర్ తోపాటు సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ లారీ యాజనులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుపాలని వాటి పరిష్కారాని