ఉపాధ్యాయుడిగా మారిన జగిత్యాల కలెక్టర్ మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల) పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేసరు విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి బోధనా స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.