90 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాసు కుటుంబం పై టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గురజాల పట్టణంలో ఆయన మాట్లాడుతూ మాచవరంలో కాసు మహేష్ రెడ్డి పై మాట్లాడిన మాటలను వక్రీకరించి అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. టిడిపి నాయకులు గ్రామాలలో దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు.