ప్రజా సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందడం లేదన్నారు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పథకంగా మార్చారని ఆరోపించారు. హాస్టల్లో విద్యార్థులు రోగాల బారిన పడుతున్న ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.