పుస్తకం జ్ఞానాన్ని పెంచుతుందని అందుకే గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మాతంగి కాంప్లెక్స్ లో సొసైటీ అధ్యక్షుడు ఎరుకల లక్ష్మణరావు అధ్యక్షతన జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి, డాక్టర్ మోహన్ రావు, మాలె మధు పాల్గొని మాట్లాడారు. ఈనాటి సమాజంలో పుస్తకం చదివితే జ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతుందన్నారు. గ్రంధాలయానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.