కుప్పం ద్రవిడ వర్సిటీలో సీఎం చంద్రబాబు కృషితో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ చొరవతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.