యానాం సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్-3 మీదుగా ఓఎన్జీసీ కి వెళ్లే పైపులైన్ లీకైన సంఘటన సంబంధించి కలెక్టర్ మహేష్ కుమార్ కు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు గురువారం వినతి పత్రం ఇచ్చారు. అమలాపురం కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి పైపులైన్ లీక్ సంఘటనకు సంబంధించిన వివరాలు అందించారు. స్థానికులకు భద్రత కల్పించాలని, పరిహారం అందించాలని కోరారు.