మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి దామోదర్ ను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వచ్చే కల్యాణ లక్ష్మికి తులం బంగారం పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విస్తరించాలని కూడా ఆయన తెలిపారు.