డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదామని, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఐజి శ్రీ ఆకే రవికృష్ణ ఐపియస్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్నూల్ శివారులోని దూపాడు దగ్గర ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ ఐజి గారు ముఖ్య అతిథిగా పాల్గొని " డ్రగ్స్ వద్దు బ్రో " అనే కార్యక్రమం పై అవగాహన చేశారు. ఈసందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ గారు మాట్లాడుతూ... డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ పోస్టర్స్ ఆవిష్కణలో “డ్రగ్స్ మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలని నాశనం చేస్తుంది