సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంతో 10 గేట్లు ఓపెన్ చేసి దిగువకు 75000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏ ఈ ఈ జాన్ స్టాలిన్ శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.