ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్ లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకనూ చూడవలసిన కాలం లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. సోమవారం పిజిఅర్ఎస్ లో కలెక్టర్ ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని , లేని యెడల సంబందిత అధికారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు . సోమవారం 10am to 2pm PGRS కు 188 వినతులు అందాయి.