శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో మంగళవారం ఉదయం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆర్డీవో సువర్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. POPతో తయారు చేసిన విగ్రహాలు వాడటంతో వాటర్ పొల్యూషన్ అవుతుందన్నారు. అందరూ మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.