మామిడికుదురు మండలం గోగన్నమఠంలో ONGC వైఖరిని నిరసిస్తూ మత్స్యకారులు మంగళవారం ధర్నా చేశారు. ఆ సంస్థ కార్యకలాపాల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరదల సీజన్లో దొరికే అరుదైన పులసలు దొరకటం లేదని వాపోయారు. ONGC కార్యకలాపాల వల్లే పులసలు వలస వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. పులసల వేట లేక తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.