కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం CWC అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 8,17,430 క్యూసెక్కుల వరద చేరిందన్నారు. బ్యారేజ్ లోని 59 గేట్ల ద్వారా 8,17,183 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు.