అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వినాయక చవితి సందడి మొదలైంది. బుధవారం జరగబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో భక్తులు విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. వీధులన్నీ వినాయక విగ్రహాలతో కిటకిటలాడుతున్నాయి.దుల్పేట్ నుంచి వచ్చిన కార్మికులు ప్రత్యేకంగా రూపొందించిన ఈ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నవాటి నుంచి 15 నుండి 20 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 200 విగ్రహాలు సిద్ధం చేసినట్లు యజమాని తెలిపారు. ఈ విగ్రహాలను తయారు చేయడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని చెప్పారు.