జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మూసి నది అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మూసి నది అభివృద్ధి ప్లాను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నది పరివాహక అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇతర ఉన్నత శాఖ అధికారులు పాల్గొన్నారు.