నల్లగొండ జిల్లాలోని జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద డేటా సేకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాటి గురువారం ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు తహసిల్దార్లు ఎంపీడీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 33600 మరణాలు సంభవించాయని, అయితే పథకానికి కేవలం 31 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.