సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కగా చేపట్టి,జ్వర లక్షణాలున్న వారిని త్వరగా గుర్తించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో జ్వరాలు ఏమేరకు నమోదు అవుతున్నాయని పరిశీలనలో బాగంగా మండలంలో దబ్బగెడ్డ గ్రామంలో బుధవారం పర్యటించారు.ముందుగా గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి గ్రామస్తులకు నిర్వహించిన వైద్య పరీక్షలు,జ్వర లక్షణాలతో ఎంత మంది ఉన్నారు,అందజేసిన చికిత్సా వివరాలుతెలుసుకున్నారు. గృహ సందర్శనలు చేసి గ్రామంలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో పరిశీలించారు. ఫ్రైడే డ్రైడే, కార్యక్రమాన్ని పరిశీలించారు.